: రాజకీయ ప్రచార సభలతో వేడెక్కిన ఉత్తరభారతం
ఉత్తరభారతదేశంలో రాజకీయ ప్రచార సభలు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోరుకు తెరదీశాయి. ఓవైపు నరేంద్రమోడీ, మరోవైపు రాహుల్ గాంధీ పోటాపోటీ సభలతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. నేడు బీహార్ రాజధాని పాట్నాలో మోడీ 'హుంకార్' ర్యాలీ జరగనుండగా.. ఢిల్లీలో రాహుల్ సభ ఈ మధ్యాహ్నం జరగనుంది. దేశ రాజధానిలో రాహుల్ గాంధీ ఓ సభలో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా.. జేడీయూ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మోడీ బీహార్లో ఓ సభలో పాల్గొనడం ఇదే ప్రథమం. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత రాహుల్ పై ఉండగా.. బీహార్లో బీజేపీ శక్తి ఏంటో సీఎం నితీశ్ కు రుచి చూపాలని మోడీ కృతనిశ్చయంతో ఉన్నారు.