: పాట్నా రైల్వే స్టేషన్ లో రెండు బాంబులు నిర్వీర్యం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీ మరికాసేపట్లో ఆరంభం కానుండగా, బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఫ్లాట్ ఫామ్ నెం.10 వద్ద మరో రెండు బాంబులను కనుగొన్నారు. వాటిని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. మోడీ ర్యాలీకి తరలి వచ్చే కార్యకర్తల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది. బీజేపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.