: పాట్నా రైల్వేస్టేషన్ లో పేలిన నాటుబాంబు
బీహార్లోని పాట్నా రైల్వే స్టేషన్ లో ఈ ఉదయం నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాగా, పాట్నాలో నేడు నరేంద్ర మోడీ ర్యాలీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.