: పలు రైళ్ల దారి మళ్లింపు.. కొన్ని రద్దు
భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్-యశ్వంత్ పూర్ రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. హౌరా -యశ్వంత్‌పూర్, భువనేశ్వర్ - బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-వాస్కో అమరావతి ఎక్స్‌ప్రెస్, పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్ రైళ్లను విజయనగరం, రాయ్పూర్, నాగ్పూర్ మీదుగా మళ్లిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది. పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది.