: విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం


ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో, అన్ని గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. నిన్న 4.5లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయగా.. ఈ ఉదయం వరద ప్రవాహం 4.56లక్షల క్యూసెక్కులుగా ఉంది. నీటిని పెద్ద మొత్తంలో కిందికి వదిలేస్తుండడంతో రామలింగేశ్వర నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలోని ప్రజలను నగరంలో ఏర్పాటు చేసిన 8 పునరావాస కేంద్రాలకు తరలించారు. కొందరు మాత్రం ఇళ్లలోనే ఉండి భయంతో గడుపుతున్నారు. బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. జలమయమైన రామలింగేశ్వర నగర్ లో స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఉదయం పర్యటించారు. బాధితులకు సాయం చేస్తామని ప్రకటించారు. రక్షణ గోడను కట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News