: చెరువులోకి దూసుకెళ్లిన లారీ.. 8 మంది మృతి
ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది జలసమాధి అయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ లోడుతో ప్రకాశం జిల్లా కంభం వైపు వెళుతున్న లారీ పెద్దారవీడు మండలం గొబ్బూరులో ఆటోను ఢీకొట్టి చెరువులోకి బోల్తా కొట్టింది. ఎనిమిది మంది అక్కడికక్కడే కన్నుమూశారు. డ్రైవర్ సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది మృతదేహాలనూ వెలికితీశారు. క్రేన్ సాయంతో ఆరుగంటల పాటు శ్రమించి లారీని కూడా బయటకు తీశారు. మృతులను రోజు కూలీలు, రైతులుగా గుర్తించారు.