: రాయదుర్గంలో దొంగల బీభత్సం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సురేష్ జైన్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు దంపతులపై ఆయుధాలతో దాడి చేసి 30 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్ళారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.