: ముఖ్యమంత్రి రాసిన లేఖను హోం శాఖకు పంపిన రాష్ట్రపతి


రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా మాత్రమే జరగాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ లేఖలోని అంశాలన్నింటిని పరిశీలించాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. 2012-ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొనడానికి నవంబర్ 5న రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రిని పిలిచి లేఖలోని అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News