: 24 గంటల్లో బలహీన పడనున్న అల్పపీడనం
రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణ, విదర్భ, చత్తీస్ గఢ్ మీదుగా సాగుతున్న అల్పపీడనం బలహీనపడితే వర్షాలు తగ్గుముఖం పడతాయని కూడా తెలిపింది. అల్పపీడనానికి తోడు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తా, రాయలసీమలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.