: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన
గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. దాంతో, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. బాధితులను పరామర్శించి, నష్టం వివరాలను తెలుసుకోనున్నారు.