: చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్ సమం


దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడింది. తటస్థ వేదిక దుబాయ్ లో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో చక్కని పోరాట పటిమ చూపి విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు, రెండో టెస్టులో ఎప్పట్లానే తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఒటమిపాలైంది. దీంతో, రెండు టెస్టుల సిరీస్ 1-1 తో సమానమైంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జట్టంతా కలిపి సెంచరీ కూడా చేయలేకపోయిన పాకిస్థాన్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు నిర్థేశించిన 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసిన పాక్ మరో రోజు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. దీంతో, సిరీస్ సమమైంది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపిక కాగా, సిరీస్ లో విశేషంగా రాణించిన డివిలీర్స్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికయ్యాడు.

  • Loading...

More Telugu News