: మహిళలపై దాడులు అరికట్టాలి: వెంకయ్యనాయుడు
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యంతోనే ఇలాంటి దాడులను అరికట్టవచ్చని అన్నారు. హైదరాబాదులో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన ప్రసంగించారు.