: నియంత్రణ రేఖ అంశంపై భారత్-పాక్ చర్చించుకోవాలి: బాన్ కీ మూన్
నియంత్రణ రేఖ వద్ద కాల్పుల అంశంపై భారత్-పాకిస్థాన్ లు శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రోత్సహించారు. రెండు దేశాల మధ్య గల ఉద్రిక్తతలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నట్లు బాన్ అధికార ప్రతినిధి మార్టిన్ నెసిర్కీ పేర్కొన్నారు. దానివల్ల ఇరు దేశాల శాంతి, సామరస్యాన్ని రక్షించుకోవచ్చన్నారు. భారత్-పాక్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొన్ని రోజుల కిందట చేసిన విజ్ఞప్తిని అగ్రరాజ్యం అమెరికా విస్పష్టంగా తిరస్కరించింది.