: క్యాన్సర్ బాధితులు పెరగడం దురదృష్టం: బాలకృష్ణ


దురదృష్టవశాత్తు దేశంలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిలో 'బ్రెస్ట్ క్యాన్సర్ డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్ సోకిన వారు ధైర్యంగా ఉండి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ ను జయించిన మహిళలను ఆయన సత్కరించారు.

  • Loading...

More Telugu News