: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి


నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ రాములు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న రాములు.. విధి నిర్వహణలో భాగంగా బందోబస్తు కోసం ఈరోజు నల్గొండ జిల్లాకు వెళ్లారు. నకిరేకల్ బైపాస్ పై అతను ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఎస్సైని నార్కెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఎస్ఐ మరణించాడు.

  • Loading...

More Telugu News