: తుపానునే ఆపిన రాజకీయ తుపాను జగన్: లక్ష్మీపార్వతి


తుపానునే ఆపిన రాజకీయ తుపాను జగన్ అని లక్ష్మీపార్వతి అన్నారు. హస్తినలోని గుడ్డి దర్బారు దిగ్విజయ్ అనే దూతను పంపించిందని... ఆయన దుర్మార్గమైన రాయబారాన్ని మనం ఎదుర్కోవాలని తెలిపారు. తెలుగు జాతికి వెలుగు అందించింది ఎన్టీఆర్ అయితే, తెలుగు రాజ్యాన్ని అభివృద్ధిలో నడిపించింది వైఎస్సార్ అని అన్నారు. వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలరని లక్ష్మీపార్వతి అన్నారు. 60 ఏళ్ల క్రితం ఇక్కడ కొనసాగిన దొరల పాలనను గుర్తుకు తెచ్చుకోవాలని తెలంగాణవాదులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News