: రాష్ట్రం విడిపోతే రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి: బైరెడ్డి
విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న నాయకులు ఇన్నేళ్లుగా రాయలసీమకు ఏం చేశారని బైరెడ్డి ప్రశ్నించారు. రాజధానిని సీమలో ఏర్పాటు చేస్తే నాలుగు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.