: కాశ్మీర్ విషయంలో పాక్ ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా
కాశ్మీర్ సమస్యలోకి అమెరికాను ఎలాగైనా లాగాలని ప్రయత్నించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తీవ్ర నిరాశ మిగిలింది. ఈ వారంలో అమెరికాలో పర్యటించిన షరీఫ్... కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి అమెరికా జోక్యం చేసుకోవాలని పలుమార్లు కోరారు. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా తేల్చి చెప్పింది. తాము కేవలం భారత్, పాకిస్థాన్ ల మధ్య చర్చలు జరిగేలా చూడగలమే కానీ... నేరుగా జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి జెన్ సాకీ వెల్లడించారు. కాశ్మీర్ పై తమ వైఖరి ఎన్నటికీ మారదని సాకీ అన్నారు.