: డిసెంబర్ నుంచి పొగమంచు ప్రభావిత మార్గాల్లో 20 రైళ్ల రద్దు


పొగమంచు ప్రభావిత మార్గాల్లో 20 రైళ్లు రద్దు చేయాలని ఉత్తరాది రైల్వే భావిస్తోంది. డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు ఆలోచన చేస్తోంది. అంతేకాక, కొన్ని రైళ్ల మార్గాలను మార్చనుంది. జార్ఖండ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్, హౌరా-ఢిల్లీ ఎక్స్ ప్రెస్, లిచ్చవి ఎక్స్ ప్రెస్, వారణాసి-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్, ఇతర రైళ్లు రద్దయ్యే వాటిలో ఉన్నాయి. దాంతో, వీటి టికెట్ల బుకింగ్ ను కూడా ఆపివేయనున్నట్లు ఉత్తర రైల్వే అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News