: పార్లమెంటులో బిల్లును ఆపాలని విజయమ్మ కోరారు: శోభానాగిరెడ్డి


పార్లమెంటులో బిల్లును ఆపాలంటూ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీలో జాతీయ పార్టీలను కూడా కలిశారని ఆ పార్టీ నేత శోభానాగిరెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో ఆమె మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారి సమైక్యతకు పార్టీ కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. తెలుగువారి సంస్కారం గురించి మాట్లాడుతూ పీవీ ప్రధాని అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు సీమాంధ్ర నేతలు ఎలా సహకరించిందీ చెప్పారు. విభజనకు ఎవరు మద్దతిచ్చారు, ఎవరు అంగీకరించారని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఎందుకూ పనికిరారన్న ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు విభజనకు అంగీకారం తెలిపాయని ఆమె ఆక్షేపించారు. ప్రజా ఉద్యమంలో ఎవరైనా అభిప్రాయాలను సమీక్షించుకోవాల్సిందేనని, విభజన నిర్ణయాన్ని కూడా అలానే వెనక్కి తీసుకోవాని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News