: జగన్ తో కాంగ్రెస్ ఫిక్సింగ్ చేసుకుంది: జేసీ


విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని అందుకే 'సమైక్య శంఖారావం' సభ విజయవంతమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండనక్కర్లేదన్నారు. భారీవర్షాల్లో ఇతర రైళ్లను ఆపి 18 ప్రత్యేక రైళ్లను జగన్ సభకు ఇచ్చారని ఆరోపించారు. జగన్ బెయిల్ విషయం కంటే.. క్విడ్ ప్రోకో లేదంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడమే ఆశ్చర్యమని హైదరాబాదులో మీడియాతో అన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే జగన్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News