: రెండు రాష్ట్రాల రైతుల మధ్య కాల్పులు.. 10 మందికి గాయాలు
రెండు రాష్ట్రాల రైతుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కాల్పులకు దారి తీసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల బోర్డర్ లో ఉన్న అటవీ శాఖ భూమికి సంబంధించి ఈ వివాదం తలెత్తింది. వివాదం ముదరి చివరకు ఒక వర్గంపై మరొకరు కాల్పులు జరిపేంత వరకు వెళ్లింది. ఇరుప్రాంత రైతులు పరస్పరం కాల్పులకు దిగడంతో... 10 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవకు సంబంధించి మధ్యప్రదేశ్ లోని సెన్వా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.