: మంత్రులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం


గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రజలకు భరోసా ఇవ్వాలని సీఎం సూచించారని రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడ్రోజులు భారీవర్షాలు కురుస్తాయని.. కోస్తా, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖనుంచి హెచ్చరికలు అందినట్లు చెప్పారు. భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు 425 మండలాల్లో తీవ్రనష్టం వాటిల్లినట్టు రఘువీరా తెలిపారు.

  • Loading...

More Telugu News