: బాబును కలిసిన 'అనంత' నాయకులు
కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఈ రోజు అనంతపురం జిల్లా నేతలు కలిశారు. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, బి.కె. పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్, మాజీ ఎంపీ కాలువ శ్రీనివాస్ బాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పయ్యావుల మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల పట్ల ప్రభుత్వం వివక్షాపూరిత ధోరణి కనబరుస్తోందని ఆరోపించారు. ఈ విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. నగరాలతో సమానంగా పన్నులు కడుతున్నా, గ్రామీణులు నగర ప్రజలకంటే అధికంగా విద్యుత్ కోతలు అనుభవిస్తున్నారని పయ్యావుల అన్నారు.