: సచిన్ 200వ టెస్టు టాస్ కోసం ప్రత్యేక నాణెం


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు సందర్భంగా టాస్ వేసేందుకు ప్రత్యేక నాణెం వినియోగించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ముంబయి వాంఖెడే మైదానంలో జరిగే వీడ్కోలు మ్యాచ్ అనంతరం సచిన్ క్రికెట్ నుంచి వైదొలగనున్న సంగతి తెలిసిందే. కాగా, సచిన్ గౌరవార్థం ఆ టెస్టుకు టాస్ వేసేటప్పుడు ప్రత్యేక నాణేన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఆ నాణేనికి ఒకవైపున సచిన్ బొమ్మ ఉంటుందని.. రెండో వైపున బీసీసీఐ లోగోగానీ, ఎంసీఏ లోగోగానీ ముద్రిస్తామని బీసీసీఐ క్రికెట్ డెవలప్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి తెలిపారు.

భారత్, విండీస్ జట్ల మధ్య జరిగే ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు సచిన్ ను బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ సత్కరిస్తారని శెట్టి చెప్పారు. ఇక, టెస్టు ముగిసిన తర్వాత సచిన్ వీడ్కోలు కార్యక్రమాన్ని బోర్డు మరింత ఘనంగా నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, ఈ మ్యాచ్ వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరగనుంది.

  • Loading...

More Telugu News