: ఒకే వేదికపైకి వస్తున్న ప్రధాని, మోడీ..!


గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన మ్యూజియంను స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు అంకితం చేయనున్నారు. వల్లభాయ్ స్మారకార్థం ఆ మ్యూజియంను పటేల్ మెమోరియల్ సొసైటీ నిర్మించింది. ఈనెల 29న జరగనున్న ఈ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రత్యేక అతిథిగా నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి దిన్షా పటేల్.. మోడీని కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. దాంతో, ప్రధాని, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఒకే వేదికను తొలిసారి పంచుకోనున్నారు. ఇక, రెండు రోజుల తర్వాత 31న పటేల్ విగ్రహ ఏర్పాటుకు దక్షిణ గుజరాత్ లోని నర్మదా జిల్లా కేవదియ కాలనీలో మోడీ శంకుస్థాపన చేస్తారు.

  • Loading...

More Telugu News