: జమ్మూకాశ్మీర్ లో కంపించిన భూమి
జమ్మూకాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఈ తెల్లవారుజామున 5.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. భదేర్వా పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లనప్పటికీ... ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.