: జగన్ సభకు తెలంగాణ సెగ
జగన్ సభకు తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న సమైక్య శంఖారావం సభను అడ్డుకునేందుకు నిజాం కాలేజీ విద్యార్థులు ప్రయత్నించారు. 'జై తెలంగాణ' నినాదాలు చేస్తూ సభా ప్రాంగణంలోకి దూసుకుపోయారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. తామిది ముందే ఊహించామని, అయితే, తాము స్పందించాల్సిన అవసరం లేదని, పోలీసులే వారి సంగతి చూసుకుంటారని వ్యాఖ్యానించారు.