: సీఎంను ఉత్తరకుమారుడితో పోల్చిన సీపీఐ నారాయణ
సీఎం కిరణ్ కుమార్ మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏ తుపానునూ అడ్డుకోలేరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.