: యూనివర్సల్ సెల్ షాప్ లో భారీ చోరీ


నిజామాబాద్ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని యూనివర్సల్ సెల్ ఫోన్ షాపులో భారీ చోరీ జరిగింది. దుండగులు ఇనుపరాడ్డుతో షాపుకు ఒకవైపు ఉన్న షట్టర్ ను ధ్వంసం చేసి, రాళ్లతో అద్దాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కౌంటర్ లో ఉన్న లక్ష రూపాయల నగదు, ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకుపోయారు. షాపులో ఎక్కడ ఏముంటాయో తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News