: బీజేపీ నుంచి వైదొలగనున్న మాజీ పీఎం వాజ్ పేయి మేనకోడలు!


మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. గతంలో ఎంపీగా ఉన్న ఆమె బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే, ఆరోగ్య కారణాలతో వాజ్ పేయి పార్టీ కార్యకలాపాల నుంచి పూర్తిగా తప్పుకోగా, అప్పటినుంచి పార్టీలో ఆమెకు కూడా ప్రాధాన్యం తగ్గింది. దాంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న శుక్లా ఈ ఉదయం రాయ్ పూర్ లోని తన నివాసం ఆనంద్ నగర్ లో పలువురు మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు కొద్దిసేపట్లో ఆమె ప్రకటన చేయనున్నారు.

  • Loading...

More Telugu News