: చివరి వరకూ పోరాడతాం: చిరంజీవి
విభజనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాడతామని అన్నారు. తెలంగాణపై బిల్లు, తీర్మానం రెండూ అసెంబ్లీకి పంపాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళుతోందన్న సీఎం వ్యాఖ్యలను తామంతా సమర్ధిస్తున్నామని ఆయన తెలిపారు. సీమాంధ్రుల ఆకాంక్షలను పట్టించుకోకుండా విభజనపై మొండిగా ముందుకు వెళ్లడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్షించరని ఆయన అభిప్రాయపడ్డారు.