: కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన బాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో, సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో అనధికార పొత్తులు పెట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ తెలుగుజాతిని నాశనం చేసేందుకు పూనుకుందని మండిపడ్డారు. అధికారం కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారని బాబు తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు కాంగ్రెస్ ఇకనైనా స్వస్తి చెప్పాలని బాబు హితవు పలికారు. ఇక, ముంపు బాధితులను పట్టించుకోవడంలేదని సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి, బాధితులకు లబ్ది చేకూర్చేందుకే తాను పర్యటిస్తున్నట్టు బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News