: సంజయ్ దత్ శిక్ష కుదింపుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదు: 'మహా' హోం మినిస్టర్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శిక్ష తగ్గింపుపై కేంద్రం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ తెలిపారు. అటు, సంజయ్ భార్య మాన్యతతో పాటు ఆయన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ కూడా తమకు ఎటువంటి విజ్ఞప్తులు చేయలేదని చెప్పారు. సంజూ శిక్షపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ వినోద్ తవాడే నిన్న(శుక్రవారం) పాటిల్ ను కలిశారు. సంజూకు శిక్ష తగ్గింపు ప్రతిపాదనను వ్యతిరేకించారు. తప్పుచేసిన వ్యక్తి ఓ నేరస్తుడైనా, రాజకీయ నేత అయినా, నటుడైనా.. ఎవరైనా న్యాయస్థానం ముందు సమానమేనని, ఇలా చేయడంవల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు అందే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సంజయ్ కు ఐదేళ్ల శిక్ష విధించడంతో పుణేలోని యరవాడ జైల్లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News