: లంక మాజీ క్రికెటర్ జయసూర్య భార్య విడాకుల పిటిషన్


శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ సనత్ జయసూర్య భార్య శాండ్రా కొలంబో డిస్ట్రిక్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె న్యాయవాది అనోమా గుణతిలకే వివరాలు తెలిపారు. అక్టోబర్ 23న దాఖలైన పిటిషన్ మేరకు త్వరలోనే కోర్టు నుంచి జయసూర్యకు నోటీసులు జారీ చేస్తారని చెప్పారు. అయితే, తన ముగ్గురు పిల్లల జీవనంకోసం భారీగా భరణం ఇప్పించాలని శాండ్రా కోరినట్లు అనోమా తెలిపారు. లంక ఎయిర్ లైన్స్ లో పనిచేసిన శాండ్రా.. జయసూర్యకు రెండవభార్య. 1998లో సుముదు కరుణానాయకే అనే మహిళను వివాహం చేసుకున్న జయసూర్య ఏడాది తిరగకుండానే ఆమెతో విడిపోయారు.

  • Loading...

More Telugu News