: సింగరేణిలో నిలచిన బొగ్గు ఉత్పత్తి
భారీ వర్షాలతో సింగరేణిలో దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో... అవి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, కరీంనగర్ జిల్లా రామగుండం పరిధిలోని 1, 2, 3, 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు.