: విశాఖ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధానమైన సమస్య రాష్ట్ర విభజన సమస్యని అన్నారు. అంతేకాకుండా, వరద బాధితులకు తెలుగుదేశం అండగా ఉంటుందని తెలిపారు. రెండ్రోజులపాటు చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.