: వేడి పెరిగిపోయి... మంచు కరిగిపోతోందట


భూమిపై గ్రీన్‌ హౌస్‌ వాయువుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. ఇది ఎంతగా అంటే ఆర్కిటిక్‌ ప్రాంతంలో గత ఏడాది సరాసరి ఉష్ణోగ్రత గత 44 వేల ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కెనడియన్‌ ఆర్కిటిక్‌ ప్రాంతంలో గత ఏడాది సరాసరి వేసవి ఉష్ణోగ్రత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు.

హోలోసీన్‌ కాలం సుమారు 11,700 సంవత్సరాల క్రిందట ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కాలం మొదట్లో ఉన్న గరిష్ట స్థాయి వేడిని ప్రస్తుత ఉష్ణోగ్రత అధిగమించింది అనడానికి ఈ అధ్యయనం తోడ్పడిందని పరిశోధకులు చెబుతున్నారు. హోలోసీన్‌ కాలం ఆరంభకాలంలో ఉత్తరార్ధగోళానికి వేసవికాలంలో నేటికన్నా సుమారు 9శాతం మేర ఎక్కువ సూర్యతాపం తగిలేది. కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మంచు ఫలకాల వద్ద రేడియో కార్బన్‌ డేటింగ్‌ విధానం ద్వారా పరిశోధనలు జరిపి ఈ విషయాలను తేల్చారు. ఈ పరిశోధనలో సహజసిద్ధమైన ప్రక్రియల కారణంగా ఉష్ణం పెరగడంలేదని, వాతావరణంలో పేరుకుపోతున్న గ్రీన్‌ హౌస్‌ వాయువులే దీనికి కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News