: చేతులు కడుక్కోండి... నిరాశను పారద్రోలండి!


మీ చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి చాలు... ఇక మీ సమస్యలన్నీ తీరిన భావన మీలో కలుగుతుందట. అంటే మీలోని నిరాశా నిస్పృహలు దూరమవుతాయని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మీరు ఏదైనా వైఫల్యాలకు చెందిన నిరాశా భావనలో ఉన్నారా... అయితే చక్కగా చేతులను కడుక్కుంటే చాలని, మీలోని నిరాశ భావన దూరమై ఆశావహ భావన ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

వైఫల్యాల తర్వాత శారీరక శుభ్రతను పాటిస్తే అది మనపై మానసికపరమైన ప్రభావాన్ని చూపుతుందట. ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనం జరిపిన జర్మనీలోని కొలోగ్ని విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ కాయి కాస్పర్‌ వైఫల్యాల తర్వాత చేతులు కడుక్కోవడం వల్ల మనలో నిరాశ భావన దూరమవుతుందని చెబుతున్నారు. మూడు బృందాలకు కాస్పర్‌ ఒక అసాధ్యమైన పనిని అప్పగించి ఈ ప్రయోగం చేశారు. ఈ పరిశోధనలో శుభ్రత వల్ల మనసులోని ప్రతికూల భావనలు తొలగుతాయని తేలిందని కాస్పర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News