: కటక్ వన్డే రద్దు?


అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు కటక్ లో జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒడిశా క్రికెట్ సంఘం కటక్ లోని బారాబతి మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నా వరుణుడి జోరు తగ్గకపోవడంతో వారి శ్రమ ఫలించడంలేదు. దీంతో, మ్యాచ్ ను రద్దు చేసి టిక్కెట్ల సొమ్మును వాపస్ ఇవ్వడమే మేలని ఒడిశా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అంపైర్లు పిచ్ ను పరిశీలించిన తర్వాత మ్యాచ్ రద్దు విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఒడిశా క్రికెట్ సంఘం కార్యదర్శి ఆశీర్వాద్ బెహరా తెలిపారు. మ్యాచ్ రద్దయితే ఒడిశా క్రికెట్ సంఘానికి రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News