: వర్షాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష


భారీవర్షాల కారణంగా నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. వర్షాలకు ఇళ్లు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వర్షాల ధాటికి ఇప్పటివరకు 20 మంది మృత్యువాత పడ్డారని అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం 135 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 68 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.34 లక్షల హెక్టార్లలో పంట నీట మునిగిందని సీఎంకు వివరించారు. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరినందున నీటిని దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News