: పుల్లెల గోపీచంద్ మౌనంపై గుత్తా జ్వాల ఆశ్చర్యం
'బాయ్' (బ్యాండ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తనపై జీవితకాల నిషేధం విధించాలంటూ తీసుకున్న నిర్ణయం పట్ల బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మౌనం వహిస్తుండడంపై క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గోపీచంద్ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదని జ్వాల ప్రశ్నించింది. మాజీ కోచ్ లు ఆరిఫ్, విమల్ తమ అభిప్రాయాన్ని తెలిపారని, మరి, చీఫ్ కోచ్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా పేరున్న గోపీచంద్ తన వ్యవహారంపై కనీసం స్పందించకపోవడమేంటని జ్వాల అడిగింది.