: లైంగిక దాడి కేసులో రాజస్థాన్ మాజీమంత్రి అరెస్ట్


రాజస్థాన్ మాజీ మంత్రి బాబులాల్ నాగర్ అరెస్టయ్యారు. ముప్పై ఐదేళ్ల మహిళపై లైంగిక దాడి కేసులో కొంతకాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఈ ఉదయం సీబీఐ ప్రశ్నించింది. ఈ సందర్భంగా నాగర్ ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేసింది. అయితే, నాగర్ సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ ఆయనను ఈ సాయంత్రం అరెస్టు చేసింది. గతనెలలో జరిగిన ఈ ఘటనలో ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News