: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలకు బృందాలు పంపుతున్నాం: కేసీఆర్


భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు పది జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు టీఆర్ఎస్ తరపున బృందాలను పంపుతున్నట్లు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఇందుకోసం వరద ప్రభావిత ప్రాంతాలకు ఐదు బృందాలను పంపుతున్నామని చెప్పారు. పార్టీ బృందాలు వైద్యులను తీసుకుని ఆ ప్రాంతాలకు వెళతాయన్నారు. కాగా, తెలంగాణలోని వరద బాధితుల కోసం అనేకమంది దాతలు సాయం ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ బృందాలు జరిగిన నష్టాన్ని సేకరిస్తాయని, ఆ నష్టం వివరాలను ప్రభుత్వానికి అందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News