: దక్షిణాఫ్రికా గాయని మకాబె 81వ జయంతిని స్మరించుకున్న గూగుల్
దక్షిణాఫ్రికా ప్రఖ్యాత గాయకురాలు, పౌరహక్కుల కార్యకర్త మిరిమ్ మకాబె 81వ జయంతిని సెర్చ్ ఇంజిన్ గూగుల్ స్మరించుకుంది. సోమవారం మిరిమ్ జయంతిని పురస్కరించుకుని గూగుల్ పేజీపై ఆమె డూడుల్ ఫోటోను ఉంచింది. 1932, మార్చి 4 న జన్మించిన మకాబె దక్షిణాఫ్రికాలో ప్రముఖ గాయకురాలిగా పేరు పొందారు. ఈమెకు 'మామా ఆఫ్రికా' అనే పేరు కూడా ఉంది.
ఆఫ్రికన్ సంగీతానికి 1960 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం కల్పించిన వారిలో మకాబె తొలి కళాకారిణి. 1957లో ఆమె మొదటిసారి రికార్డు చేసిన 'పటా పటా' ఆల్బంతో ప్రసిద్ధి చెందడంతో మరింత పేరు సంపాదించు కున్నారు. గ్రామీ అవార్డు కూడా దక్కించుకున్నారు. అప్పట్లో జాత్యహంకార వర్ణ వివక్ష ప్రదర్శిస్తున్న దక్షిణాఫ్రికాప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చే యడంతో మకాబే ఆ దేశ పౌరసత్వం కోల్పోయారు.
ఈ సమయంలో ఆమె సుమారు 10 దేశాల గౌరవ పౌరసత్వం పొందారు. అయితే, 1990లో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాను విడుదల చేసినప్పుడు ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. 2008 నవంబర్ 9న మకాబే తనువు చాలించారు.
ఆఫ్రికన్ సంగీతానికి 1960 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం కల్పించిన వారిలో మకాబె తొలి కళాకారిణి. 1957లో ఆమె మొదటిసారి రికార్డు చేసిన 'పటా పటా' ఆల్బంతో ప్రసిద్ధి చెందడంతో మరింత పేరు సంపాదించు కున్నారు. గ్రామీ అవార్డు కూడా దక్కించుకున్నారు. అప్పట్లో జాత్యహంకార వర్ణ వివక్ష ప్రదర్శిస్తున్న దక్షిణాఫ్రికా
ఈ సమయంలో ఆమె సుమారు 10 దేశాల గౌరవ పౌరసత్వం పొందారు. అయితే, 1990లో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాను విడుదల చేసినప్పుడు ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. 2008 నవంబర్ 9న మకాబే తనువు చాలించారు.