: కన్నీళ్లు తుడవడానికే వచ్చా: మోడీ
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలు గుప్పించారు. తాను కన్నీళ్లు కార్చనని, కన్నీళ్లు తుడవడానికి వచ్చానని అన్నారు. మధ్యప్రదేశ్ ఝాన్సీలో జరిగిన ఎన్నికల సభలో మోడీ ప్రసంగించారు. బుందేల్ ఖండ్ వెనుకబాటుతనానికి యూపీఏ పాలనే కారణమని విమర్శించారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చిన ప్యాకేజీ రాజకీయ నాయకుల కోసమే కానీ ప్రజలకోసం కాదని దుయ్యబట్టారు.