: నవంబర్ 5న పీఎస్ఎల్వీ సీ-25 ప్రయోగం


నవంబర్ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-25 ప్రయోగం నిర్వహించనున్నట్టు షార్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 2.36 నిమిషాలకు ప్రయోగించనున్నట్లు చెప్పారు. అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం రూపొందించిన ఆర్భిటర్ ను పీఎస్ఎల్వీ సీ-25 ద్వారా రోదసిలోకి పంపుతున్నామని ఆయన వివరించారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానానికి పీఎస్ఎల్వీ సి-25 ప్రయోగం తొలి పరీక్ష అని చెప్పారు. ఈ ప్రయోగం కోసం రూ.450 కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగానికి 56.3 గంటల ముందు కౌంట్ డౌన్ మొదలవుతుందని, సీ-25 ప్రయోగం ఇస్రోకు 25వ ప్రయోగమని వివరించారు. కాగా, తిరువనంతపురంలో వచ్చేనెల నెలాఖరున ఇస్రో స్వర్ణోత్సవాలు జరుగుతాయన్నారు.

  • Loading...

More Telugu News