: హెలికాప్టర్ సాయంతో గ్రౌండ్ ను ఆరబెట్టేందుకు ఓసీఏ ప్లాన్


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మనరాష్ట్రంతో పాటు ఒడిశాలోనూ భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని కటక్ నగరం కూడా వర్షాలతో జలమయమైంది. రేపు కటక్ లో భారత్, ఆసీస్ జట్ల మధ్య ఐదో వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సజావుగా సాగేందుకు మైదానం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవుట్ ఫీల్డ్ మరీ చిత్తడిగా మారడంతో ఆరబెట్టేందుకు హెలికాప్టర్ ఉపయోగించాలని ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) భావిస్తోంది. కేంద్రపార ఎంపీ బీజే పాండా నుంచి హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుని మైదానాన్ని ఆరబెట్టే పనులకు వినియోగించాలనుకుంటున్నామని ఓసీఏ ఆశీర్వార్ బెహరా తెలిపారు. గత నాలుగురోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని, రేపటి కల్లా పరిస్థితిలో మార్పు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News