: రెండో త్రైమాసికంలో రూ. 2,352 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఐసీఐసీఐ బ్యాంక్
దేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఐసీఐసీఐ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రెండో త్రైమాసికంలో అంచనాలను మించి 20.1 శాతం లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2,352 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పోయినేడాది ఇదే సమయంలో ఐసీఐసీఐ నికర లాభం రూ. 1,960 కోట్లు మాత్రమే.