: ముగ్గురు డాక్టర్లను కత్తితో పొడిచిన రోగి
ఓ రోగి ముగ్గురు డాక్టర్లను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. చైనాలోని జీజియాంగ్ ప్రావిన్స్ లోని వెన్లింగ్ సిటీ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ముగ్గురు డాక్టర్లపై దాడికి తెగబడ్డాడు. ముగ్గురు డాక్టర్లను సర్జికల్ కత్తితో పొడిచాడు. దీంతో, ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఓ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పోలీసులు రోగిని అదుపులోకి తీసుకుని, డాక్టర్లను ఎందుకు పొడిచాడన్న దానిపై విచారిస్తున్నారు.